అంశము : te.wikipedia.org లో మీ ఖాతా, వాడుకరి పేజీ సృష్టి

పాఠ్య లక్ష్యం: తెలుగు వికీపీడియా వెబ్ సైట్ te.wikipedia.org పై అవగాహన, మీ ఖాతా సృష్టించుకొంటారు, వాడుకరి పేజీ లో రాయటం, మీడియా ఎలా ఇన్సర్ట్ చేస్తారో తెలుసుకొంటారు.

ఈ పాఠములో -

  1. తెలుగు వికీపీడియా పరిచయము - పాఠ్యము 15 నిమిషములు (తెలుగు వికీపీడియా వెబ్ సైట్ te.wikipedia.org పై అవగాహన, మీ ఖాతా సృష్టించుకొంటారు, వాడుకరి పేజీ లో రాయటం, మీడియా ఎలా ఇన్సర్ట్ చేస్తారో తెలుసుకొంటారు.)
  2. తెలుగు వికీపీడియాలో ఖాతా సృష్టి - వీడియో 5.05 నిమిషాలు
  3. తెలుగు వికీపీడియాలో మీ ఖాతాలో వాడుకరి పేజీ సృష్టి - వీడియో 7.16 నిమిషాలు
  4. తరచుగా అడిగే ప్రశ్నలు
  5. అభ్యాసము
  6. అభ్యాస ఫలితం : పాఠము ముగిసే సరికి, te.wikipedia.org పై అవగాహన, మీ ఖాతా సృష్టించుకొంటారు, వాడుకరి పేజీ లో రాయటం, మీడియా ఎలా ఇన్సర్ట్ చేస్తారో నేర్చుకొంటారు.

తెలుగు వికీపీడియాలో ఖాతా సృష్టి

alt-text-here

alt-text-here

  1. మీరు అనుకొన్న వాడుకరి పేరు అంటే మీ user name టైపు చెయ్యండి
  2. ఒక సంకేత పదం అంటే password టైపు చెయ్యండి
  3. సంకేత పదం మళ్లీ నిర్ధారించండి
  4. మీ ఇమెయిల్ చిరునామా ఇవ్వండి,
    • ఇది ఐచ్చికం అయినా కుడా ఇవ్వటం వలన మీరు రాసిన వ్యాసాలలో మార్పులు జరిగినపుడు మీ ఇమెయిల్ ద్వారా తెలుపబడుతుంది
  5. చూపిన “captha” ని క్రింది బాక్స్ లో టైపు చెయ్యండి.
  6. మీ ఖాతాను సృష్టించండి అనే నీలం రంగు బటన్ నొక్కి మీ ఖాతా సృష్టించుకోండి.

alt-text-here

  1. లాగిన్ అవ్వండి
    • కుడి చేతి వేపు మీ పేరు కనిపిస్తుంది ఎర్రటి అక్షరాలలో.
    • అక్కడే ఒక గమనిక పెట్టెలో మీ profile పేజీ లేదు సృష్టించుకోమని చెప్తోంది
    • వికీపేడియాలో ఒక పేజీ సృష్టించి అందులో ఏమీ రాయకపోతే ఆ పేజీ పేరు ఎర్ర అక్షరాలలో కనిపిస్తుంది
    • ఆ పేజిలో రాసిన తరువాత అది నీలం రంగుకి మారుతుంది

alt-text-here

alt-text-here

  1. ఈ పేజి లో మీ గురించి రాయండి, అంటే మీ విద్యార్హత, మీ ఊరి గురించి, మీ అభిరుచులు వంటి వివరాలు
  2. ఇక్కడ మీ ఫోన్ నంబరు, ఇమెయిల్ చిరునామా ఇవ్వకూడదు
  3. మీ వ్యక్తిగత వివరాలు, సున్నితమైన విషయాలు రాయకండి

alt-text-here

  1. మీ గురించి రాసిన తరువాత మీడియా ద్వారా మీ ఫోటోని ఈ పేజిలో ఎక్కించవచ్చు.
  2. ఇది పూర్తిగా ఇచిక్కం. మీకు ఇష్టం లేకపోతే పెట్టకండి
  3. మీరు స్వంతంగా తీసిన లేక మీరు హక్కు కలిగి ఉన్న చిత్రాన్ని మాత్రమే ఎంచుకొని అప్ లోడ్ చెయ్యాలి
  4. అన్యుల చిత్రాలు పెట్టకండి

alt-text-here

  1. మీడియా లో ఫోటో పై క్లిక్ చేస్తే ఈ పక్కన కనిపిస్తున్న “దస్త్రాన్ని ఎంచుకోండి” విండో ఓపెన్ అవుతుంది
  2. అక్కడ క్లిక్ చేస్తే అది మీ కంప్యూటర్ / మొబైల్ లోని చిత్రాలని చూపిస్తుంది.

వాడుకరి పేజిలో ఫోటో కూర్పు

alt-text-here

  1. కంప్యూటర్ నుండి లేక మొబైల్ లో నుండి మీరు ఎంచుకొన్న ఫోటోని ఎక్కించండి

alt-text-here

  1. ఫోటో ఎంచుకొన్నాక ఈ పక్కన కనిపిస్తున్న విండో లో మీరు ఎంపిక చేసిన ఫోటో కనిపిస్తుంది.
  2. క్రింద “ఇది నా స్వంత కృతి” అనే వాక్యము, దాని పక్కనే ఒక బాక్స్ కనిపిస్తుంది.
  3. ఆ బాక్స్ లో tick పెడితేనే ఈ ఫోటో అప్ లోడ్ అవుతుంది.
  4. ఈ ఫోటో మీరు తీసినది ఐతే మాత్రమే tick పెట్టండి
  5. Tick పెట్టాక పైన నెల్లం రంగులో కనిపిస్తున్న “ఎక్కించు” పై క్లిక్ చెయ్యండి

వాడుకరి పేజిలో ఫోటో కూర్పు

alt-text-here

  1. పైన కనపడుతున్న మాధ్యమము అమరికలు పేజీ ఓపెన్ అవుతుంది
  2. ఇందులో ఫోటోకి సంబంధించిన గురించి వివరాలు, ఫోటో గురించి వివరణ, వర్గ ఎంపిక తెలుపాలి
  3. వివరణ రాసాక “భద్రపరుచు” అనే నీలం రంగు బటన్ పైన క్లిక్ చెయ్యండి

వాడుకరి పేజిలో ఫోటో కూర్పు

alt-text-here

  1. “Use this image” పై క్లిక్ చెయ్యండి

వాడుకరి పేజిలో ఫోటో కూర్పు

alt-text-here

  1. వాడుకరి పేజిలో ఫోటో కింద పరిచయ వ్యాఖ్య రాయండి.
  2. ఇక్కడ మీరు ఏదన్న లింక్ ని కుడా కాపీ పేస్టు చెయ్యవచ్చు.
  3. ఏదైనా “ఉల్లేఖనం” అంటే కొటేషన్ రాయవచ్చు.
  4. ఇవన్ని పూరించక నీలం రంగులో కనిపిస్తున్న “చొప్పించు” పై క్లిక్ చెయ్యండి
  5. ఇప్పుడు మీరు అప్ లోడ్ చేసిన ఫోటో మీ వాడుకరి పేజిలో కనిపిస్తుంది.

alt-text-here

  1. ఇప్పుడు మీ user పేజి అంటే వాడుకరి పేజి ప్రచురణకి సిద్ధంగా వుంది.
  2. “పేజిని ప్రచురించి” పై క్లిక్ చేసినపుడు మీరు ఈ పేజిలో చేసిన సవరణలు ఏమిటో తెలియచెయ్యండి.
  3. మళ్ళి “పేజీని ప్రచురించు” పై క్లిక్ చెయ్యండి.

వాడుకరి పేజీ ప్రచురణ పూర్తి

alt-text-here

  1. ఇప్పుడు మీ వాడుకరి పేజి ప్రచురణ పూర్తయ్యింది. మీ పేరు నీలం రంగులో కనిపిస్తుంది
  2. మీరు మీ గురించి రాసుకొన్న వాఖ్యాలు, మీరు ఎక్కించిన ఫోటో మీ పేజిలో కనిపిస్తాయి.
  3. మీరు రాసిన వ్యాసలను చదివి ఎవరన్నా మీ గురించి తెలుసుకోవాలంటే ఈ పేజిని చూస్తారు.
  4. మీ వ్యాసం గురించి వారు ఏదైనా వివరములు తెలియ చేయ్య్లలనుకొంటే, ఎడమ వైపు వున్న సంప్రదింపు పేజీలో రాస్తారు. అది మీరు ఇమెయిల్ రూపంలో చదువగలరు.
  1. వినియోగదారు పేజీని సృష్టించడం మరియు ప్రొఫైల్ వికీపీడియాను జోడించడం యొక్క ఉపయోగం ఏమిటి

    యూజర్ పేజీలు అనేవి యూజర్ మరియు యూజర్ టాక్ నేమ్ స్పేస్ ల్లో అడ్మినిస్ట్రేషన్ పేజీలు, ఇవి యూజర్ లు వికీపీడియాలో చేసే పనిని నిర్వహించడం మరియు సహాయపడటానికి, అదేవిధంగా యూజర్ ల మధ్య ఇంటరాక్షన్ మరియు షేరింగ్ ని సులభతరం చేయడానికి ఉపయోగపడతాయి. యూజర్ పేజీలు ప్రధానంగా వ్యక్తిగత చర్చ, నోటీసులు, టెస్టింగ్ మరియు డ్రాఫ్ట్ లు (చూడండి: శాండ్ బాక్స్ లు) మరియు, కోరుకున్నట్లయితే, పరిమిత స్వీయచరిత్ర మరియు వ్యక్తిగత కంటెంట్ కొరకు ఉంటాయి.
  2. నా వినియోగదారు పేజీలలో ఏమి ఉండకూడదు ?

    సాధారణంగా, మీరు వికీపీడియాతో సంబంధం లేని సమాచారం మీ యూజర్ ఉండకపోవటమే మంచిది . వికీపీడియా సాధారణ హోస్టింగ్ సేవ కాదు, కాబట్టి మీ వినియోగదారు పేజీ వ్యక్తిగత వెబ్‌సైట్ కాదు మీ యూజర్ పేజీ అనేది వికీపీడియన్ గా మీ గురించి, మరియు ప్రాజెక్ట్ కు కంట్రిబ్యూట్ చేయడానికి మీ ప్రయత్నాల్లో భాగంగా మీ యూజర్ స్పేస్ లోని పేజీలను ఉపయోగించాలి.
  3. వికిపీడియా లొ /'సంకేత పదం password ' కాని మర్చిపోతె ఎలా రాబట్టుకోవాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఏమి చెయ్యాలి?

    లాగిన్ అయ్యేచోటే "నా సంకేతపదం మర్చిపోయాను, కొత్తది పంపించు" అనే మీట ఉంది. అది నొక్కితే, మీరిచ్చిన ఈ మెయిల్ ఐడీ కి కొత్త సంకేతపదం వస్తుంది. సభ్యత్వం పొందేటపుడు మీరు మీ ఈ మెయిల్ ఐడీ ఇచ్చి ఉండకపోతే.., సంకేతపదాన్ని పొందే ఏర్పాటు లేనట్లే
  4. నా లాగిన్ పేరు తెలుగు లోకి మార్ఛాలంటె ఎలా?

    వికీపీడియా అదికారికి అర్జి పెట్టుకొంటే అధికారిగారు తెలుగు లొ పేరు మార్పిడి చేస్తారు.
  5. నా చర్చా పేజీలో నాకు నచ్చని కామెంట్లు ఉంటే ఏమి చేయాలి

    వికీలో ఆర్కైవ్ ప్రాధాన్యత ఇవ్వబడినా, వారి స్వంత టాక్ పేజీల నుంచి వ్యాఖ్యలను తొలగించడం నుంచి యూజర్ లు రిజిస్టర్ చేసుకున్నలేదా రిజిస్టర్ చేసుకోని వారిని పాలసీ నిషేధించదు.సాధారణంగా ఒక వినియోగదారు తమ వినియోగదారు పేజీ నుండి మెటీరియల్ ను తీసివేస్తే, వినియోగదారు దాని కంటెంట్ లను చదివి, దాని గురించి తెలుసుకున్నట్లు తీసుకోబడుతుంది. వాటిని ప్రదర్శించాల్సిన అవసరం లేదు
  6. ఇతర సంపాదకుల వినియోగదారుల మరియు వినియోగదారు చర్చా పేజీల సవరణ

    సాధారణంగా, ఎవరైనా ఇతర యూజర్ మరియు యూజర్ టాక్ పేజీలను గణనీయంగా సవరించడాన్ని పరిహరించాలి, ఇది సంక్వమిత ఎడిట్ లు ఆశించబడుతుంది మరియు/లేదా సహాయకారిగా ఉంటుంది.
  7. నేను వికీపీడియాని వదిలిపెడితే నా యూజర్ పేజీ ఏమవుతుంది .

    మీరు మీ స్వంత పేజీని తొలగించాలనుకుంటే, పేజీ పైభాగాన్ని {{db-u1} with తో ట్యాగ్ చేయండి మరియు నిర్వాహకుడు మీ కోసం దాన్ని తొలగిస్తాడు. అయితే, వినియోగదారు చర్చా పేజీలు సాధారణంగా తొలగించబడవని గమనించండి. ఒక వేళ మీరు ఏమార్పూ చేయకుండా ఒక వినియోగదారు వికీపీడియాను విడిచిపెట్టినప్పుడు, వారి వినియోగదారు మరియు వినియోగదారు చర్చా పేజీలు సాధారణంగా ప్రభావితం కావు మరియు భవిష్యత్తులో ఏ సమయంలోనైనా సవరించబడతాయి
  8. వినియోగదారు ఉపపేజీలు

    యూజర్ స్పేస్ లోని సబ్ పేజీలు, వికీపీడియా గురించిన వ్యాసాలను, వికీపీడియా వ్యాసాల ను భద్రపరచడానికి, ఇతర విషయాలతో పాటు వికీపీడియా వ్యాసాల ను నిల్వ చేయడానికి ఉపయోగించవచ్చు. ఈ ఉపపేజీలను మీరే సృష్టించుకోవచ్చు.
https://forms.gle/oLYA2sKreaiCJV2a9